ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

ABN, Publish Date - Aug 08 , 2024 | 02:24 PM

జపాన్‌(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.

టోక్యో: జపాన్‌(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. 25 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది. దీని ధాటికి పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలోని నైరుతి ప్రాంతానికి సునామీ హెచ్చిరికలు జారీ చేసింది. క్కసారిగా ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. భారీ భూకంపం సంభవించడంతో జపాన్‌లోని నైరుతి ప్రాంతంతోపాటు వివిధ పట్టణాలు, గ్రామాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మియాజాకి, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌, కొచ్చి, ఓయిటా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మియాజాకి ప్రిఫెక్చర్‌లో 20 సెంటీమీటర్ల ఎత్తు మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. 7.1 తీవ్రత భూకంపం పరిణామాలను అధికారులు అంచనా వేస్తున్నారు.


జపాన్‌ ఇషికావాలోని ఉత్తర-మధ్య ప్రాంతంలో కూడా ఈ మధ్య కాలంలో స్వల్ప ప్రకంపణలు వచ్చాయి. నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అయితే ఆ సమయంలో సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. తాజా భూకంపంతో అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సముద్రం, నదుల వైపుఎవరూ వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Updated Date - Aug 08 , 2024 | 03:03 PM

Advertising
Advertising
<