ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరతాం

ABN, Publish Date - Nov 18 , 2024 | 03:44 AM

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

  • ప్రధాన సలహాదారు యూనస్‌

ఢాకా, నవంబరు 17: భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్‌ పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ చెప్పారు. ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం సందర్భంగా దేశాన్ని విడిచిన హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం యూనస్‌ టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘పదవీచ్యుత నియంత షేక్‌ హసీనాను తిప్పి పంపాలని భారత్‌ను కోరుతాం’’ అని చెప్పారు. ఆమె కాలంలో జరిగిన హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పగించడం కోసం ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. అందుకోసం ఎన్నికల సంస్కరణలు చేపడుతామని తెలిపారు. మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను ఎక్కువ చేసి చెబుతున్నారని వ్యాఖ్యానించారు. హసీనాను తొలగించిన తరువాత ఇస్లామిస్ట్‌ సంప్రదాయవాదుల ప్రభావం అఽధికమయిందని, అందువల్లనే హిందువులపై దాడులు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

Updated Date - Nov 18 , 2024 | 03:46 AM