Pakistan: ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు వీరమరణం
ABN, Publish Date - Nov 20 , 2024 | 04:42 PM
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) లో ఆత్మాహుతి దాడి (Suicide Attack) జరిగింది. వాయవ్య ఖైబెర్ ఫఖ్య్తంఖ్వా ప్రావిన్స్‌లోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై సూసైడ్ బాంబర్ పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంలో దూసుకువచ్చి పేల్చేసుకోవడంతో 12 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పాయారు. హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది.
జీ20 గ్రూప్ ఫొటోలో బైడెన్‌కు దక్కని చోటు!
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో అక్కడి ప్రహరీగోడలోని కొంతభాగం, చుట్టుపక్కల సామగ్రి ధ్వంసమైంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు ఫ్రాంటియర్ కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడి అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
ఉగ్రవాదానికి కేంద్రస్థానం
పాకిస్థాన్‌లో ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లు గత ఏడాదిగా ఉగ్రవాద ఘటనలకు కేంద్రంగా మారాయి. ఇటీవల కాలంలో ఉగ్రదాడులను పరిగణనలోకి తీసుకుని మిలిటెన్సీకి కళ్లెం వేసేందుకు బలూచిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై 'సమగ్ర మిలటరీ ఆపరేషన్'కు సివిల్, మిలటరీ నాయకత్వం మంగళవారంనాడు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమగ్ర మిటలరీ ఆపరేషన్ నిర్ణయాన్ని ఫెడరల్ ఎపెక్స్ కమిటీ తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఫెడరల్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ఆర్మీ చీఫ్ జనరల్ సైయద్ అసిమ్ మునిర్, ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రపంచ యుద్ధం ముప్పు?
ప్రపంచ సంఘర్షణలతో పేద దేశాలు సతమతం
For More International And Telugu News
Updated Date - Nov 20 , 2024 | 04:42 PM