Islamabad: ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:43 AM
భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా పాకిస్థాన్ ఆహ్వానించింది.
ఇస్లామాబాద్, ఆగస్టు 25: భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా పాకిస్థాన్ ఆహ్వానించింది. అక్టోబరు 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) ప్రభుత్వాధినేతల మండలి (సీహెచ్‌జీ) సదస్సుకు హాజరు కావాల్సిందిగా మోదీతోపాటు ఇతర దేశాధినేతలను కోరింది.
అయితే భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం సరిగా లేని నేపథ్యంలో ఈ సదస్సుకు మోదీ వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది కజకిస్థాన్‌లో జరిగిన సీహెచ్‌జీ సదస్సుకు కూడా ప్రధాని మోదీ హాజరు కాలేదు. కాగా, సీహెచ్‌జీకి రష్యా, చైనా నేతృత్వం వహిస్తుండగా.. భారత్, పాకిస్థాన్ సభ్యులుగా ఉన్నాయి. రొటేషన్‌లో భాగంగా సీహెచ్‌జీ సదస్సు ఈసారి పాక్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో జరగనుంది.
Updated Date - Aug 26 , 2024 | 05:43 AM