Rocket Fall: చైనాలో పడిన రాకెట్.. పరుగులు తీసిన జనం
ABN, Publish Date - Jun 23 , 2024 | 08:00 AM
ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
బీజింగ్: ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను (Long March 2C) శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. లాంగ్ మార్చ్ 2సీలో నెట్రోజన్ టైట్రాక్సైడ్, అన్ సిమెట్రిక్ డైమెథైల్హైడ్రాజెన్ యొక్క హైపర్ గోలిక్ మిశ్రమం ఉపయోగించారు. ఇవి విష పదార్థాలు. రాకెట్‌లో కొంత భాగం పేలడంతో భయం ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విష పదార్థాలు గాలిలో కలిసిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి దెబ్బతీస్తుందని ఆందోళన చెందారు.
రాకెట్‌లో కొంతభాగం పేలడంతో జనం, నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. చైనా అధికారులకు మాత్రం ఇవేమి పట్టడం లేదు. తమ రాకెట్ ప్రయోగం మాత్రం విజయవంతం అయ్యిందని ప్రకటన చేసింది. నక్షత్రాల్లో జరిగే పేలుళ్లను అధ్యయనం చేసేందుకు శక్తిమంతమైన ఉపగ్రహం ప్రయోగించామని చెబుతోంది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లిందని వెల్లడించింది. గామా రే పేలుళ్లతో సహా ఖగోళ దృగ్విషయాలను అధ్యయనం చేయడం ఉపగ్రహ లక్ష్యం. ఖగోళ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
Updated Date - Jun 23 , 2024 | 08:01 AM