ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi Kuwait Visit: లేబర్ క్యాంపులో భారతీయ కార్మికులతో మోదీ మాటామంతీ

ABN, Publish Date - Dec 21 , 2024 | 07:31 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌లోని గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను శనివారంనాడు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు.

కువైట్: రెండ్రోజుల కువైట్ (Kuwait) పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్ (Gulf Spic Labour Camp)ను శనివారంనాడు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు. వారితో కలిసి స్నాక్స్, శీతల పానీయం తీసుకుని వారి యోగక్షేమాలను విచారించారు.

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి


దీనికి ముందు కువైట్ సిటీలోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. 101 ఏళ్ల మంగళ్ సేన్ హండా అనే మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని కలిసి ఆత్మీయ సంభాషణ చేశారు. అక్కడున్న ప్రవాస భారతీయలను పలకరించారు. రామాయణం, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించిన అబ్దుల్లా బరూన్, వాటి పబ్లిషర్ అల్నెసెఫ్‌లను కలుసుకున్నారు. అక్కడ జరిగే 'హలా మోదీ' కార్యక్రమంలో సుమారు 4 వేల మంది భారతీయులను సైతం కలుసుకోనున్నారు. అరేబియా గల్ఫ్ కప్, ఫుట్‌బాల్ టోర్నమెట్ ప్రారంభోత్సవానికి హజరుకానున్నారు.


కువైట్ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. కువైట్‌కు భారత ప్రధాని వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్‌లో పర్యటించారు. మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందంపై చర్చలు జరుగుతాయని, వీటితో పాటు పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరుగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ పర్యటనతో ఇండియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్టు విదేశాంగ శాఖలోని ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. కువైట్ ప్రస్తుతం జీసీసీకి అధ్యక్షత వహిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీసీసీ దేశాలతో భారత్ 184.46 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం సాగించింది.


ఇవి కూడా చదవండి..

Donald Trump: 18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్‌ సర్కారు బహిష్కరణ కత్తి!

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

Read Latest and International News

Updated Date - Dec 21 , 2024 | 07:32 PM