ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: భారత ప్రధాని పర్యటన రేపు రైలులో ఉక్రెయిన్‌కు ప్రయాణం

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:18 AM

ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘ట్రైన్‌ఫోర్స్‌ వన్‌’ అనే విలాసవంతమైన రైలులో ప్రయాణించనున్నారు.

  • శాంతియుత పరిష్కారమే లక్ష్యం

  • అధ్యక్షుడు జెలెన్‌స్కీతో

  • ఆ దిశగా చర్చలు: ప్రధాని మోదీ

  • 2 రోజుల పర్యటనలో భాగంగా

  • పోలండ్‌ చేరుకున్న మోదీ

  • 45 ఏళ్ల తర్వాత తొలిసారి

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘ట్రైన్‌ఫోర్స్‌ వన్‌’ అనే విలాసవంతమైన రైలులో ప్రయాణించనున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో విమానాశ్రయాలకు భద్రత లేకుండా పోయుంది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన రైల్లో కీవ్‌కు వెళ్తున్నారు. పోలండ్‌ నుంచి 10 గంటల పాటు ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ రైల్లో ప్రయాణించి ఆయన కీవ్‌కు చేరుకుంటారు.


ఈ రైలు ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో విలాసవంతమైన సౌకర్యాలతో పాటు అధునాతన భద్రత ఏర్పాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు బయటి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా ఈ రైలును నడపడం అంత తేలికేమి కాదు. అందుకే పకడ్బందీ ఏర్పాట్ల మధ్యదీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ వంటి ప్రపంచ నేతలు ఇందులోనే ప్రయాణించారు.

Updated Date - Aug 22 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<