ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

27 లక్షల కోట్ల క్యాష్‌!

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:17 AM

అమెరికాకు చెందిన దిగ్గజ పెట్టుబడిదారు, వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ వద్ద ప్రస్తుతం ఏకంగా 32,500 కోట్ల డాలర్ల (రూ.27 లక్షల కోట్లు) నగదు ఉంది.

  • బఫెట్‌ వద్ద 32,500 కోట్ల డాలర్ల నగదు

  • యాపిల్‌, అమెరికా బ్యాంక్‌లో వాటా విక్రయం

  • సొంత సంస్థ బెర్క్‌షైర్‌ నుంచి లాభాల వెల్లువ

  • కుప్పలు కుప్పలుగా పోగుబడిన నగదు

  • రూ.82 లక్షల కోట్లకు బెర్క్‌షైర్‌ మార్కెట్‌ విలువ

న్యూయార్క్‌, నవంబరు 3: అమెరికాకు చెందిన దిగ్గజ పెట్టుబడిదారు, వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ వద్ద ప్రస్తుతం ఏకంగా 32,500 కోట్ల డాలర్ల (రూ.27 లక్షల కోట్లు) నగదు ఉంది. ఆపిల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కంపెనీల్లో తాజాగా షేర్ల అమ్మకంతోపాటు, తన సొంత కంపెనీ బెర్క్‌షైర్‌ హ్యాథవే నుంచి వస్తున్న లాభాలతో బఫెట్‌ వద్ద కుప్పలు తెప్పలుగా నగదు పోగుపడిపోతోంది. అయినప్పటికీ, దీనిని ఎక్కడా పెద్దగా పెట్టుబడులు పెట్టటానికి బఫెట్‌ ఆసక్తి చూపించటం లేదు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశంలో బఫెట్‌ మాట్లాడుతూ, ‘పెట్టుబడులు పెట్టటానికి మనం తొందరపడాల్సిన పని లేదు. ఎందుకంటే, చాలా తక్కువ రిస్క్‌తో అత్యధిక లాభాలు వచ్చినప్పుడే ఆ పని చేద్దాం’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెర్క్‌షైర్‌ మార్కెట్‌ విలువ 97,400 డాలర్లుగా (రూ.81,94,638 కోట్లు) ఉంది.

Updated Date - Nov 04 , 2024 | 02:18 AM