London: భారత్ నుంచి రహస్యంగా ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు!
ABN, Publish Date - Sep 07 , 2024 | 06:01 AM
ఉక్రెయిన్‌పై యుద్ధంలో పైచేయి సాధించటానికి రష్యా.. భారత్ నుంచి ఎలకా్ట్రనిక్స్ తదితర కీలక సామగ్రిని, టెక్నాలజీలను రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.
ఉక్రెయిన్‌పై యుద్ధంలో పైచేయికి రష్యా వ్యూహం
పశ్చిమ దేశాలకు తెలియకుండా అమలు.. కథనం ఫైనాన్షియల్ టైమ్స్
లండన్, సెప్టెంబరు 6: ఉక్రెయిన్‌పై యుద్ధంలో పైచేయి సాధించటానికి రష్యా.. భారత్ నుంచి ఎలకా్ట్రనిక్స్ తదితర కీలక సామగ్రిని, టెక్నాలజీలను రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. పశ్చిమ దేశాలకు తెలియని మార్గాల ద్వారా వీటి సేకరణ జరుగుతున్నట్లు తెలిసింది. బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. 2022 అక్టోబరులో రష్యా పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ దాదాపు రూ.8,200 కోట్ల (ఆ సమయంలో వంద కోట్ల డాలర్లకు సమానం) మేర ఖర్చు చేసి భారత్ నుంచి కీలకమైన ఎలకా్ట్రనిక్స్‌ను కొనాలని ప్రణాళిక రచించింది.
భారత్‌కు చమురు విక్రయాల ద్వారా రష్యా బ్యాంకుల్లో నగదు రూపంలో పోగుపడిన రూపాయలను ఈ విధంగా ఖర్చు చేయవచ్చని రష్యా ప్రభుత్వం భావించింది. రష్యా-భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసి అభివృద్ధి పరిచే ఎలకా్ట్రనిక్స్ సంస్థలకు పెట్టుబడులను భారీ ఎత్తున తరలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని లీకైన ఉత్తర ప్రత్యుత్తరాలను ఫైనాన్షియల్ టైమ్స్ ప్రస్తావించింది. కొన్ని రకాల ఎలకా్ట్రనిక్స్ ఉపకరణాలు, యంత్రాలకు సంబంధించి 2022 సంవత్సరం మధ్యలో భారత్ నుంచి రష్యా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపినట్లుగా ఆధారాలున్నాయని తెలిపింది.
ఇన్నోవియో వెంచర్స్ అనే భారత కంపెనీ 49 లక్షల డాలర్ల విలువైన డ్రోన్లు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాలను రష్యాకు సరఫరా చేసిందని, కిర్గిస్థాన్‌కు 6 లక్షల డాలర్ల విలువైన సామగ్రిని పంపిందని వెల్లడించింది. 5.68 లక్షల డాలర్ల విలువైన రేడియో ఎలకా్ట్రనిక్ సిస్టమ్స్‌ను రష్యా కంపెనీ టెస్ట్‌కాంప్లెక్ట్ భారత్ నుంచి దిగుమతి చేసుకుందని, రష్యా మిలిటరీ సామగ్రి సేకరణలో ఈ కంపెనీ ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పేర్కొంది. సదరు కంపెనీపై అమెరికా, ఈయూ ఆంక్షలు ఉన్న విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో గుర్తు చేసింది.
Updated Date - Sep 07 , 2024 | 06:01 AM