గోధుమపిండిలో విషం కలిపి 13 మంది హత్య
ABN, Publish Date - Oct 08 , 2024 | 03:49 AM
పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకుంది. వారిని అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలు తయారు చేసి వడ్డించింది. రాత్రి భోజనం చేసిన 13 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అందరూ..
ప్రియుడితో పెళ్లికి అడ్డుపడుతున్నారని పాక్‌లో దారుణం
సింధూ ప్రావిన్స్, అక్టోబరు 7: ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి అడ్డుపడుతున్నారని సొంత కుటుంబాన్నే కడతేర్చింది ఓ బాలిక. ప్రియుడితో కలిసి తినే ఆహారంలో విషం కలిపి 13 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని సింధూ ప్రావిన్స్‌లో ఆగస్టు 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖైర్పూర్లోని హైబత్ ఖాన్ బోహ్రి గ్రామానికి చెందిన బాలిక.. కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది.
పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకుంది. వారిని అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలు తయారు చేసి వడ్డించింది. రాత్రి భోజనం చేసిన 13 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అందరూ మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Updated Date - Oct 11 , 2024 | 11:53 AM