ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Grocery Store: కిరాణా షాపులో కాల్పులు.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు

ABN, Publish Date - Jun 22 , 2024 | 07:31 AM

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(Shooting) కలకలం రేపుతున్నాయి. ఇటివల పార్కులో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత చెందగా, 10 మంది గాయపడ్డారు.

Shooting grocery store Arkansas USA

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(Shooting) కలకలం రేపుతున్నాయి. ఇటివల పార్కులో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత చెందగా, 10 మంది గాయపడ్డారు. ఇది అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది. మ్యాడ్ బుట్చర్ కిరాణా దుకాణం(Mad Butcher grocery store)లో కాల్పులు జరుగగా, అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఆ దుండగుడిపై కూడా కాల్పులు జరిపారు. ఆ క్రమంలో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.


అయితే షాపులోపల కాల్పులు జరుగగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు(police) వెల్లడించారు. ఫోర్డైస్ అనేది లిటిల్ రాక్‌కు దక్షిణంగా 104 కిమీ దూరంలో ఉన్న సుమారు 3,200 మంది జనాభా కలిగిన పట్టణం. గాయపడిన వారిలో ఒక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కూడా ఉన్నారని, అతనికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్కాన్సాస్ గవర్నర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫోర్డైస్‌లో జరిగిన కాల్పుల పట్ల తాను బాధపడ్డానని అర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ అన్నారు. ఘటనా స్థలంలో రాష్ట్ర పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉన్నానని, బాధితుంలదరికీ అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.


ఈ అంశంపై సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పార్కింగ్ స్థలంలో పడుకున్నట్లు కనిపిస్తుండగా, మరొక వీడియోలో తుపాకీ కాల్పులు వినిపిస్తున్నాయి. గత వారం కూడా అమెరికాలోని మిచిగాన్ పార్కులో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా, పలువురు గాయపడ్డారు.


ఇది కూడా చదవండి:

యులిప్స్‌ ప్రచారంపై జర జాగ్రత్త

రూ.35 కోట్ల బుగాటీ టూర్‌బిల్లాన్‌


Read Latest International News and Telugu News

Updated Date - Jun 22 , 2024 | 07:34 AM

Advertising
Advertising