ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Heavy Rains: తుఫాను బీభత్సం.. 39కి చేరిన మృతులు

ABN, Publish Date - May 04 , 2024 | 07:18 AM

బ్రెజిల్‌(brazil) దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల(rains) కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.

storms in southern Brazil

బ్రెజిల్‌(brazil) దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌(Rio Grande do Sul)లో భారీ వర్షాల(rains) కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. భారీ వర్షాల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా(Luiz Inácio Lula da Silva) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరణించిన వారి కుంటుంబాలకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. దీంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఇటివల సౌదీ అరేబియా(saudi arabia) భారీ వర్షాల కారణంగా వరదలతో అల్లాడిపోయింది. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలను వర్షం ఎక్కువగా ప్రభావితం చేసింది. అంతే కాదు వరదల కారణంగా అప్పుడు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. మదీనాలోని మసీదు అల్ నబవీలో భారీ వర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు అదే పరిస్థితి బ్రెజిల్ దేశంలో కొనసాగుతోంది.

గత కొన్ని గంటలుగా కురుస్తున్న వర్షానికి అక్కడి జనజీవనం నానా తంటాలు పడుతున్నారు. వరద నీరు(rain water) భారీగా ఇళ్లలోకి రావడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఈ వరదలు మరింత పెరిగితే ఆనకట్టులు తెగిపోయే ప్రమాదం ఉందని కూడా అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఆకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ వర్షాలు వాతావరణ మార్పుల కారణంగా కురుస్తున్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్


Read Latest International News and Telugu News

Updated Date - May 04 , 2024 | 08:17 AM

Advertising
Advertising