ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

India - China: అరుణాచల్ ప్రదేశ్ వారిదేనట.. తీరు మార్చుకోని డ్రాగన్..

ABN, Publish Date - Apr 01 , 2024 | 12:57 PM

అరుణాచల్ ప్రదేశ్‌ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది.

అరుణాచల్ ప్రదేశ్‌ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది. అయినప్పటికీ చైనా ( China ) ప్రవర్తనలో మార్పు రావడం లేదు. తాజాగా 30 కొత్త పేర్లతో చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ పేర్లు మే 1 నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆదేశాలిచ్చింది. 2017లో మొదటి జాబితా, 2021లో రెండో జాబితా, 2023లో మూడో జాబితాను విడుదల చేసింది.

Elections 2024: మీ దారి మీది.. నా దారి నాది.. పార్టీకి ఉపాధ్యక్షుడు రాజీనామా..

అరుణాచల్ ప్రదేశ్‌లో 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సొరంగం వ్యూహాత్మకంగా ఉన్న తవాంగ్‌కు అన్ని-వాతావరణ పరిస్థితులకు కనెక్టివిటీ అందిస్తోంది. చైనా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మార్చి 23న అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న వాదనలపై స్పందించారు. ఈ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.


Jai Shankar: కచ్చతీవు రగడ.. జై శంకర్ స్పందన ఇదే..

చైనా, భారత్ మధ్య రాజుకుంటున్న వివాదంపై స్పందించిన అమెరికా తీరునూ బీజింగ్ ఖండించింది. ఈ సమస్య రెండు దేశాల మధ్య ఉన్న అంశమని, వాషింగ్టన్‌తో ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ఘాటు వ్యాఖ్యలు చేశాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 01:01 PM

Advertising
Advertising