Bangladesh: బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత.. హిందువులపై దాడి.. ఇళ్లకు నిప్పు..
ABN, Publish Date - Feb 16 , 2024 | 10:42 AM
బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ సంఘటనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగులోకి వచ్చింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ సంఘటనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగులోకి వచ్చింది. సరస్వతి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలను దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. అంతటితో ఆగని ఆగంతకులు హిందువులపై దాడి చేసి ఇళ్లు, భూమి ఇవ్వాలని బెదిరించారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. మండపం కూల్చివేతపై హిందూ, ముస్లిం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
బారియా జిల్లాలోని పైక్‌పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధిత హిందువులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఘటనలో పటుఖాలి జిల్లాలోని ఘూర్చకతి గ్రామంలో జరిగింది. ఈ ప్రాంతంలోని పలు హిందూ కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ బహిష్కరణకు గురవుతున్నారు. డబ్బులు డిమాండ్ చేశారని, దేశం విడిచి వెళ్లాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 16 , 2024 | 10:42 AM