Karachi Airport: కరాచీ విమానాశ్రయ పేలుడు ఘటనపై.. చైనా ఆగ్రహం

ABN, Publish Date - Oct 07 , 2024 | 09:27 AM

కరాచీలోని జిన్నా విమానాశ్రయంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ముగ్గురు విదేశీ పౌరులు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Karachi Airport: కరాచీ విమానాశ్రయ పేలుడు ఘటనపై.. చైనా ఆగ్రహం
Karachi Airport

పాకిస్తాన్‌(pakistan)లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లదాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిన్నా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత, ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ పేలుడుకు బాధ్యత వహించింది. మరోవైపు పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనను ధృవీకరించింది.


చైనా రియాక్షన్

ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు సంభవించిన తరువాత, మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీని కారణంగా చాలా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనను ఖండిస్తూ బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చైనా ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చైనా ఎంబసీ పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది.


పటిష్టం చేయాలి

దీంతో పాటు చైనా పౌరులు, సంస్థలు, ప్రాజెక్టుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. చైనా పౌరులు పాకిస్తాన్‌లో నివసిస్తున్న కంపెనీలు భద్రతపై శ్రద్ధ వహించాలని, స్థానిక పరిస్థితులను పర్యవేక్షించాలని, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని రాయబార కార్యాలయం కోరింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించింది. నిషేధిత సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) సోషల్ మీడియాలో ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ పాకిస్తాన్ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.


చైనీయులే లక్ష్యం

ఈ దాడి ఎయిర్ పోర్ట్ భవనాలు కంపించే స్థాయిలో జరిగిందని విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ వెల్లడించారు. ఉత్తర నజీమాబాద్, కరీమాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్ధం వినిపించింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి, ఇన్‌స్పెక్టర్ జనరల్ సహా పలువురు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అయితే ఈ దాడి చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రదేశంలో వేలాది మంది చైనా కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ప్రధానంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Hezbollah Attacks: ఏడాది సందర్భంగా ఇజ్రాయెల్‌పై మళ్లీ దాడులు.. ఇప్పటివరకు ఎంత నష్టం



IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More International News and Latest Telugu News

Updated Date - Oct 09 , 2024 | 02:44 PM