ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:14 AM

రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన తర్వాతి రోజే.. బైడెన్‌ సర్కారు మరో దూకుడు నిర్ణయాన్ని ప్రకటించింది.

కీవ్‌, నవంబరు 20: రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినిచ్చిన తర్వాతి రోజే.. బైడెన్‌ సర్కారు మరో దూకుడు నిర్ణయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌ భూభాగంలోకి రష్యా సేనలు చొచ్చుకురాకుండా ఉండేలా.. యాంటీ-పర్సనల్‌ మైన్స్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ ఈ మందుపాతరలను తూర్పు ప్రాంతాల్లో(డాన్‌బా్‌స, ఖెర్సోన్‌, మారియూపోల్‌) వినియోగించనుంది. ఈ ప్రాంతాల్లో రష్యా సేనలు స్థిరంగా చొచ్చుకువస్తుండడంతో.. యాంటీ-పర్సనల్‌ మైన్స్‌తో చెక్‌ పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. ఇవి ప్రమాదకరమైనవి. వాటిపై కాలు పెడితే.. శాల్తీలే లేచిపోతాయి. లేదంటే.. శాశ్వత అంగవైకల్యం మిగులుతుంది. అయితే.. అమెరికా సరఫరా చేయనున్న యాంటీ-పర్సనల్‌ మైన్స్‌లకు టైమర్లు ఉంటాయని, నిర్ణీత కాలం(బ్యాటరీ సామర్థ్యం మేరకు 4 గంటల నుంచి 2 వారాలు) తర్వాత వాటంతట అవే నిర్వీర్యం అయ్యేలా ప్రోగ్రామ్‌ చేసి ఉంటాయని అమెరికా పేర్కొంటోంది.

Updated Date - Nov 21 , 2024 | 05:16 AM