Student: 193 కి.మీ వేగంతో కారు ఢీ.. ఏం జరిగిందంటే..?
ABN, Publish Date - May 20 , 2024 | 12:28 PM
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. చికాగోలో విద్యార్థి మార్కొ నికెటిక్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. అతని కారును కిమ్ అనే వ్యక్తి వెనక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. ప్రమాద సమయంలో కిమ్ కారు స్పీడ్ 193 కిలోమీటర్ల వేగంతో ఉంది.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. చికాగోలో విద్యార్థి మార్కొ నికెటిక్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. అతని కారును కిమ్ అనే వ్యక్తి వెనక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. ప్రమాద సమయంలో కిమ్ కారు స్పీడ్ 193 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఆ వేగానికి నికెటిక్ కారు రెండు ముక్కలైంది. కారు ముందు భాగం రోడ్డుపైన ఉండగా, రెండో భాగం రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా నికెటిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని గర్ల్ ఫ్రెండ్ తీవ్రంగా గాయపడింది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కిమ్ తీవ్రంగా గాయపడ్డారు. అతని కారులో ఉన్న మరొకరికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేశారు. నికెటిక్ గర్ల్ ఫ్రెండ్, కిమ్ కారులో ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. నికెటిక్ గర్ల్ ఫ్రెండ్‌కు తలపై తీవ్రంగా దెబ్బ తగిలింది. నికెటిక్ హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యిందని అతని స్నేహితులు వివరించారు. ఈ జూన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతుండేదని పేర్కొన్నారు. ఇంతలో ప్రమాదం జరిగి, తమ మిత్రుడు దూరం అయ్యారని వాపోయారు. శుక్రవారం కిమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తదితర తీవ్ర నేరాలను అభియోగాలుగా నమోదు చేశారు. అత్యంత వేగంగా కారు డ్రైవింగ్ చేసిన కిమ్ మద్యం సేవించాడని, డ్రగ్స్ కూడా తీసుకున్నాడని వైద్యులు నిర్ధారించారు.
Read Latest International News and Telugu News
Updated Date - May 20 , 2024 | 12:29 PM