ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington : వారంలోనే 1,674 కోట్లు కమలా హారి్‌సకు వెల్లువెత్తుతున్న విరాళాలు

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:50 AM

అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్‌ వచ్చాక వారం వ్యవధిలోనే ఆమె ప్రచారం కోసం రూ.1,674.45 కోట్ల(200 మిలియన్‌ డాలర్ల) విరాళాలు వచ్చాయి. ఆమె ప్రచార బృందం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

వాషింగ్టన్‌, జూలై 28: అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్‌ వచ్చాక వారం వ్యవధిలోనే ఆమె ప్రచారం కోసం రూ.1,674.45 కోట్ల(200 మిలియన్‌ డాలర్ల) విరాళాలు వచ్చాయి. ఆమె ప్రచార బృందం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ విరాళాలురాలేదని, ఆమె అభ్యర్థిత్వానికి వెల్లువెత్తుతున్న మద్దతును ఇది తెలియజేస్తోందని ఆ బృందం పేర్కొంది.

అందు లో 66శాతం వరకు తొలిసారిగా విరాళాలిస్తున్న దాతల నుంచే వచ్చాయని హారిస్‌ ఫర్‌ ప్రెసిడెంట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ మైకేల్‌ టేలర్‌ చెప్పారు. వచ్చే నెల చికాగోలో నిర్వహించే డీఎన్‌సీ(డెమోక్రటిక్‌ జాతీయ సదస్సు)లో కమల అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘క్షేత్రస్థాయి కార్యాలయాలకు జనం, వలంటీర్లు పోటెత్తుతున్నారు.


కమల బృందం చేతిలో డొనాల్డ్‌ ట్రంప్‌, జేడీ వాన్స్‌కు ఓటమి తప్పదు’అని టేలర్‌ అన్నారు. అయితే ఈ హోరాహోరీ పోటీలో గెలుపు-ఓటముల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉంటుందని పేర్కొన్నారు. కమలకు విశేషంగా మద్దతు పెరగడం నూతనోత్తేజాన్ని కలిగిస్తోందన్నారు. యువ ఓటర్లు, కార్మికులు, న్యాయవాదులు, బరాక్‌, మిషెల్‌ ఒబామా దంపతులు, అనేకమంది నాయకుల నుంచి కమలకు మద్దతు వెల్లువెత్తుతోందని చెప్పారు.

పార్టీలోనూ ఆమె అభ్యర్థితానికి మద్దతు పెరుగుతోందన్నారు. గత వారంలోనే కమల బృందంలో 1,70,000 మంది కొత్త వలంటీర్లు చేరారని చెప్పారు. అమెరికావ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో కమలకు మద్దతు కూడగడతామన్నారు. ఆన్‌లైన్‌, సాంప్రదాయ మీడియా ద్వారానూ ఆమెకు మద్దతు కూడగడుతున్నామని, కమల స్వయంగా టిక్‌టాక్‌లో చేరి లక్షలాదిమంది ఫాలోవర్లను పొందారని చెప్పారు.

Updated Date - Jul 29 , 2024 | 04:50 AM

Advertising
Advertising
<