ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Voting Mandatory: ఈ ప్రాంతాల్లో ఓటు వేయడం తప్పనిసరి.. లేదంటే ఫైన్, కఠిన శిక్షలు

ABN, Publish Date - May 12 , 2024 | 03:11 PM

భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం, రాజకీయ నేతలతోపాటు అనేక మంది చెబుతున్నారు. కానీ దేశంలో ఓటు వేయడాన్ని కచ్చితంగా అమలు చేయడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా(worldwide) చూస్తే మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి(Compulsory Voting) చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Voting is mandatory in these 21 countries

భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం, రాజకీయ నేతలతోపాటు అనేక మంది చెబుతున్నారు. కానీ దేశంలో ఓటు(vote) వేయడాన్ని కచ్చితంగా అమలు చేయడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా(worldwide) చూస్తే మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి(Compulsory Voting) చేశారు. ఆయా ప్రాంతాల్లో ఓటు వేయకుంటే కఠిన శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయితే ఓటు వేయడం తప్పనిసరిగా అమలు చేసే దేశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. జనవరి 2023 నాటికి దాదాపు 21 దేశాలు ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. కానీ 11 దేశాలు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నాయి.


  • ఆస్ట్రేలియా 1924లో నిర్బంధ ఓటింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇక్కడ ఓటు వేయకుంటే జరిమానా విధిస్తారు.

  • బెల్జియంలో ఓటర్లు కానివారికి జరిమానాలు విధిస్తున్నారు. ఒకరు నాలుగు ఎన్నికల్లో ఓటు వేయకుంటే పదేళ్లపాటు ఓటు హక్కును కోల్పోతారు

  • బ్రెజిల్లో ఓటు వేయడం ఒక బాధ్యత. ఇక్కడ 18 ఏళ్లపైబడిన వారు ఓటు వేయకుంటే వారి జీతంలో కోత విధిస్తారు

  • ఈక్వెడార్‌లో కూడా ఓటు వేయడం తప్పనిసరి, ఓటు వేయకుంటే పౌర హక్కులు కోల్పోతారు

  • సింగపూర్‌లో ఓటు వేయడంలో విఫలమైతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తారు. ఇక్కడ 21 ఏళ్లు నిండిన వారు ఓటేసేందుకు అర్హులు


  • అర్జెంటీనాలో కూడా ఓటింగ్ వేయడం తప్పనిసరి చేశారు. ఇక్కడ 112 ఏళ్ల నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు

  • లీచ్‌టెన్‌స్టెయిన్‌లో ఓటు వేయని వ్యక్తి వారి గైర్హాజరు కోసం చట్టబద్ధమైన కారణం తెలపాలి, లేదంటే జరిమానా విధిస్తారు

  • లక్సెంబర్గ్ పౌరులందరు ఓటు వేయడం తప్పనిసరి. 75 ఏళ్లు పైబడిన వారు సరైన సాకును చూపించి ఎన్నికల రోజున దూరంగా ఉండవచ్చు

  • నౌరులో 1965లో ఆస్ట్రేలియన్ ఆక్రమణ తర్వాత నౌరులో ఓటు వేయడం తప్పనిసరి చేశారు. ఓటు వేయడంలో విఫలమైన వ్యక్తులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

  • పెరూలో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు మినహా అందరికీ ఓటు వేయడం తప్పనిసరి. ఎన్నికల రోజున ఓటు వేయకుంటే అధికారులు జరిమానాలు విధిస్తారు

  • సమోవా 2018లో నిర్బంధ ఓటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదట 2021 సాధారణ ఎన్నికల్లో అమలు చేయబడింది. ఇక్కడ ఓటు వేయని వారికి జరిమానా విధించబడుతుంది.


ఇది కూడా చదవండి:

Voting Process: ఓటు ఇలా వేయండి.. బీప్ సౌండ్ రాకుంటే ఏం చేయాలంటే..?


Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Read Latest International News and Telugu News

Updated Date - May 14 , 2024 | 04:28 PM

Advertising
Advertising