ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asha Devi: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?

ABN, Publish Date - Dec 17 , 2024 | 10:32 AM

ఏళ్లకు ఏళ్లు గడిచినా నేటికి దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాల్లోనే మహిళలపై దాడులు జరుగుతుంటే.. గ్రామాల్లో పరిస్థితులు ఇంకా ఎలా ఉంటుందో ఆలోచిస్తే.. ఆందోళనగా ఉంటుందన్నారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి 12 ఏళ్లు గడిచినా.. నేటికి దేశంలో మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయిందని నిర్భయ తల్లి ఆశా దేవి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఫ్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ యగైనెస్ట్ వుమెన్ అండ్ చైల్డ్ వేదికగా ఆమె తొలిసారి మాట్లాడారు. పుష్కరం గడిచినా కూడా పరిస్థితులు మారలేదని తాను చెప్పాలనుకుంటున్నానన్నారు. దేశంలో కుమార్తెలు సురక్షితంగా లేరని చెప్పారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని తాను కష్టపడుతున్నానని తెలిపారు. అయితే ఆమె తాను ఇక లేదని.. ఆమె ఎప్పటికీ తిరిగి రాదని తనకు తెలుసునన్నారు.

Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం


ఇంకా గుర్తున్నాయి..

కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరస్తులకు శిక్ష విధించాలంటూ తన కుమార్తె తనతో చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తు ఉన్నాయన్నారు. దేశంలో మహిళలను రక్షించేందుకు తాను అనేక కార్యక్రమాల్లొ పాల్గొన్నానని ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి గుర్తు చేశారు. కొత్త చట్టాలు తీసుకు వచ్చినా.. అనేక చర్చలు జరిగినప్పటికి పరిస్థితులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయినప్పటికీ.. ఆయా కేసులు కోర్టుకు చేరక పోవడం తనకు అర్ధం కానీ విషయమవుతుందన్నారు. అలాంటి వేళ.. కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రులుకు న్యాయం జరుగుతుందని మనం ఎలా ఆశించగలమని ఈ సందర్భంగా నిర్భయ తల్లి ప్రశ్నించారు.

Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర


ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలు..

అయితే ఈ ఏడాది అక్టోబర్ లో కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది.. ఇప్పటికీ ఎవరికీ తెలియదని ఆశాదేవి సందేహం వ్యక్తం చేశారు. పోలీసులు, చట్టాలతోపాటు మరిన్ని విస్తృతమైన 'వ్యవస్థ' ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎందుకు మారలేదో ఆలోచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే తాను ఎవరినీ నిందించనన్నారు. కానీ మన ఆడ పిల్లలు పాఠశాల్లో... కార్యాలయాల్లో.. ఎక్కడై సురక్షితంగా లేరని తాను బాధపడ్డానని తెలిపారు.


చిన్న పిల్లల పరిస్థితి మరి దారుణం..

ఇక చిన్ని పిల్లల పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. పట్టణాలు, నగరాల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటే.. ఇక గ్రామాల్లో పరిస్థితులు గురించి ఏమి చెప్పగలమంటూ సందేహం వ్యక్తం చేశారు. మన వద్ద ఏ చట్టాలున్నా.. అవి నిజమైన అర్థంలో చట్టంగానే ఉండాలని.. తద్వారా మన కుమార్తెలకు న్యాయం జరుగుతుందని ఆశా దేవి స్పష్టం చేశారు. తన కుమార్తెను కోల్పోయిన బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదన్నారు.


నిర్బయపై లైంగిక దాడి..

2012, డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ పిజియోథెరపి శిక్షణ పొందుతోన్న 23 ఏళ్ల యువతిపై కదిలే బస్సులో ఆరుగురు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సులో నుంచి విసిరివేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమెకు ప్రభుత్వం వైద్య సహాయం అందించింది. కానీ మెరుగైన వైద్య సహయం కోసం సింగపూర్ కు ఆమెను తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ.. డిసెంబర్ 29న ఆమె మరణించింది. అయితే ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఇక ఈ హత్యాచారానికి పాల్పడిన వారికి శిక్షలు పడిన సంగతి తెలిసిందే.

For National News And Terlugu News

Updated Date - Dec 17 , 2024 | 10:48 AM