ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Brij Bhushan Singh: కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి

ABN, Publish Date - May 29 , 2024 | 04:00 PM

మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఆయన కుమారుడు, కైసర్‌గంజ్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గొండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది.

లఖ్‌నవూ, మే 29: మహిళ రెజర్లపై లైంగిక వేధింపులు కారణంగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఆయన కుమారుడు, కైసర్‌గంజ్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్.. ప్రయాణిస్తున్న కాన్వాయ్ గోండ నగర సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో కరణ్ భూషణ్ సింగ్‌పై బాధిత కుటుంబానికి చెందిన చందా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!


దీంతో కరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు తన కుమారుడు రెహాన్ (17)తోపాటు మేనల్లుడు షాహెజాద్ (24) మందులు కోనుక్కుని రావడానికి బైక్‌పై మెడికల్ షాప్‌కు వెళ్లారని.. ఆ క్రమంలో కరణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఎదురుగా వస్తూ.. వారి బైక్‌ను ఢీ కొట్టిందని ఆమె తన పిర్యాదులో పేర్కొంది. ఇదే ఘటనలో ఓ వృద్దురాలు సైతం తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం విడి భాగాలు


అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ కన్వాయిలో కరణ్ భూషణ్ సింగ్ ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపారు. కానీ ఈ ప్రమాద ఘటనలో కరణ్ కారు డ్రైవర్‌‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన వాహనం.. బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కుటుంబం నడుపుతున్న నందిని నగర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ పేరు మీద ఉందని పోలీసులు వివరించారు.

Also Read: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్


మహిళ రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ కోర్టు సైతం ఆయనపై కేసు నమోదు చేసింది. సదరు ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్‌ను బీజేపీ అగ్రనాయకత్వం పక్కన పెట్టింది. ఆయన కుమారుడి కరణ్ భూషణ్ సింగ్‌కు కైసర్ గంజి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ బరిలో దింపింది.

Also Read: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?


పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ కుటుంబానికి ఎంపీ టికెట్ కేటాయించడంతో బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే కైసర్ గంజ్ పరిసర ప్రాంతాల్లో బ్రిజ్ భూషణ్ కుటుంబానికి అనుచరగణం అధికంగా ఉంది. దాంతో ఆ కుటుంబానికే బీజేపీ .. ఎంపీ టికెట్ కట్టబెట్టిందనే ఓ ప్రచారం సైతం స్థానికంగా ఉంది. ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరో కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్.. గోండ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 04:06 PM

Advertising
Advertising