Varanasi: రైల్వేస్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం: వందలాది వాహనాలు దగ్ధం
ABN, Publish Date - Nov 30 , 2024 | 07:45 PM
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది వాహనాలు దగ్ధమయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ సంభవించ లేదని పోలీసులు తెలిపారు.
వారణాసి, నవంబర్ 30: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని కాంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ ప్రదేశంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందితోపాటు రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌తోపాటు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.
Also Read: ఆన్‌లైన్‌లో సీఆర్‌డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్లు
Also Read: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల
Also Read: రాహుల్ గాంధీ స్వాతిముత్యం
అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం కానీ.. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ కాలేదని తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఇక ఈ ప్రమాదంలో సైకిళ్లు సైతం కాలిపోయాయని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో దగ్థమైన వాహనాలు అధిక శాతం రైల్వే ఉద్యోగులవేనని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీస్ అధికారి కున్వర్ బహదూర్ సింగ్ వెల్లడించారు.
Also Read: పవన్ చేసింది కరెక్టే: ఎంపీ పురందేశ్వరి
Also Read: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
For National News And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 07:48 PM