ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru: బెంగళూరులో నీటి కట కట.. వృథా చేసిన 22 కుటుంబాలకు ఫైన్

ABN, Publish Date - Mar 25 , 2024 | 03:47 PM

ఐటీ హబ్ బెంగళూర్‌లో తీవ్ర నీటి కోరత నెలకొంది. మంచి నీటి కోసం జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృథా చేశాయి. 22 కుటుంబాలకు జరిమానా విధించాయి.

బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌లో (Bengaluru) తీవ్ర నీటి కోరత (Water Shortage) నెలకొంది. మంచి నీటి కోసం జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కొందరికి నీటి విలువ తెలియడం లేదు. కొన్ని కుటుంబాలు నీటిని వృథా చేస్తున్నాయి. బెంగళూర్‌లో (Bengaluru) కొందరు దాహమో రామచంద్రా అంటున్నారు. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. నీటిని (Water) వృథా చేస్తున్నారు.

కారు కడిగేందుకు, చెట్ల కోసం

బెంగళూరు (Bengaluru) నగరంలో కొన్ని కుటుంబాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తీవ్ర నీటి కొరత ఉన్న అనవసర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. కారు కడిగేందుకు నీటిని వాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు చెట్ల కోసం నీటిని ఉపయోగించారు. నీటిని వృథా చేసిన 22 కుటుంబాలను బెంగళూర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల జరిమానా విధించాయి. అత్యధికంగా దక్షిణ బెంగళూర్ నుంచి రూ.80 వేలు వచ్చాయి.

ఇలా చేయండి

సిటీలో నీటి కొరత ఉండటంతో మార్చి నెల ప్రారంభంలో నగరవాసులకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు సూచనలు చేసింది. మంచి నీటిని తాగేందుకు, ఇంటి అవసరాల కోసమే ఉపయోగించాలని కోరింది. వాహనాలు కడిగేందుకు, నిర్మాణాల కోసం ఉపయోగించొద్దని తేల్చి చెప్పింది. ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నీటిని వృథా చేస్తే ప్రతిసారి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలా కొన్ని కుటుంబాలను గుర్తించి ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేల చొప్పున ఫైన్ వేసింది.

480 మిలియన్ లీటర్ల నీరు

బెంగళూర్‌ మహా నగరంలో రోజు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది. కావేరి నది నుంచి 1470 మిలియన్ నీరు సరఫరా అవుతుంది. 650 మిలియన్ లీటర్ల నీటిని బోర్ల ద్వారా తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రతిరోజు బెంగళూర్ మహానగరానికి 480 మిలియన్ లీటర్ల నీటి కొరత ఎదుర్కొంటుంది. ఆ 22 కుటుంబాల తీరును మిగతా వారు తప్పు పట్టారు. కొన్ని చోట్ల తమకు తాగేందుకు సరిపడా నీరు లేదని వాపోతున్నారు. పరిస్థితి అలా ఉంటే కొందరు అనవసరంగా నీటిని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ కుటుంబాలకు ఎక్కువ జరిమానా విధించాలని, మరోసారి నీటిని వృథా చేయాలంటే భయపడేలా పైన్ ఉండాలని కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Karnataka: కర్ణాటకలో కీలక పరిణామం.. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం

JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

Updated Date - Mar 25 , 2024 | 09:39 PM

Advertising
Advertising