Patna: ఘోరం.. 24 గంటల్లో 25 మంది మృతి.. కారణమదే
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:14 PM
ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఒక్క బిహార్‌లోనే ఏకంగా 25 మంది పిడుగుపాటుకు మృతి చెందగా 39 మంది గాయపడ్డారు. మృతులకు సీఎం నితీష్ కుమార్ శుక్రవారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
పట్నా: ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఒక్క బిహార్‌లోనే ఏకంగా 25 మంది పిడుగుపాటుకు మృతి చెందగా 39 మంది గాయపడ్డారు.
మృతులకు సీఎం నితీష్ కుమార్ శుక్రవారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలు కురుస్తున్నందునా.. పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు.
మరణించిన 25 మందిలో, మధుబనిలో ఐదుగురు, ఔరంగాబాద్‌లో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, నలందలో ముగ్గురు, లఖిసరాయ్, పట్నాలో ఇద్దరు, బెగుసరాయ్, జాముయి, గోపాల్‌గంజ్, రోహ్తాస్, సమస్తిపూర్, పూర్నియాలో ఒక్కొక్కరు మరణించారు. బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. ఒక్క జులైలోనే పిడుగుపాటు కారణంగా 50 మంది మరణించారు. అనధికారికంగా ఈ మరింతగా ఉండొచ్చు.
ఇవాళ పట్నాతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కిషన్‌గంజ్, అరారియా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. తరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల గదిపై పిడుగుపడింది. ఈ ఘటనలో విద్యార్థులంతా గాయపడ్డారు. వారిని సదర్ ఆసుపత్రిలో చేర్పించారు.
అత్యధికంగా కిషన్‌గంజ్ జిల్లాలోని బహదుర్‌గంజ్ బ్లాక్‌లో గురువారం 112.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్నాలో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.త్రివేణి బ్లాక్‌లో 102.0 మిమీ, గౌనాహాలో 55.4 మిమీ, పశ్చిమ చంపారన్ జిల్లాలోని లౌరియాలో 42.6 మిమీ, బెగుసరాయ్‌లోని సాహెబ్‌పూర్ కమల్‌లో 76.4 మిమీ, అరారియాలోని నర్పత్‌గంజ్‌లో 60.2 మిమీ, రోహ్తాస్‌లోని సంఝౌలీలో 43.2 మి.మీ, లఖిసరాయ్‌లోని సూర్యగర్హాలో 42.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
For Latest News and National News
Updated Date - Jul 12 , 2024 | 04:14 PM