Delhi water crisis: నీటి కుళాయి వద్ద ఘర్షణ: ముగ్గురికి గాయాలు
ABN, Publish Date - Jun 16 , 2024 | 07:27 PM
దేశ రాజధాని న్యూడిల్లీలో రోజు రోజుకు మంచి నీటి ఎద్దడి తీవ్ర తరమవుతుంది. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆప్ ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకుంటుంది.
న్యూఢిల్లీ, జూన్ 16: దేశ రాజధాని న్యూడిల్లీలో రోజు రోజుకు మంచి నీటి ఎద్దడి తీవ్ర తరమవుతుంది. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆప్ ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకుంటుంది. ఇంకోవైపు ఇదే అంశంలో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకున్నా నీటి కష్టాలు మాత్రం ఢిల్లీ వాసులను వదిలి పెట్టడం లేదు. న్యూఢిల్లీలోని ద్వారక సెక్టర్ 23లో వీధి కుళాయి వద్ద ఆదివారం మంచి నీరు పట్టుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి
Also Read: Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. రెండు వర్గాలను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం ఇందిరా గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక వేసవి కాలం నుంచి ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు మంచి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’
మరోవైపు న్యూఢిల్లీలో నీటి ఎద్దడి నేపథ్యంలో ఆదివారం ఛతర్‌పూర్‌లోని ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ జల శాఖ మంత్రి అతిశీ ఖండించింది. ఈ దాడి బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిదురి ఆధ్వర్యంలో జరిగిందని ఆమె మండిపడ్డారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 16 , 2024 | 07:27 PM