ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొబైల్‌లో విద్యార్థినుల 5 వేల నగ్న వీడియోలు

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:47 AM

కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా మాలూరు తాలూకా మొరార్జీదేశాయ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో డ్రాయింగ్‌ టీచర్‌ మొబైల్‌లో 5 వేలకుపైగా నగ్న వీడియోలు ఉన్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

  • కర్ణాటకలో ఆర్ట్‌ టీచర్‌ నీచకృత్యం..ఫోరెన్సిక్‌లో వెలుగులోకి

బెంగళూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా మాలూరు తాలూకా మొరార్జీదేశాయ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో డ్రాయింగ్‌ టీచర్‌ మొబైల్‌లో 5 వేలకుపైగా నగ్న వీడియోలు ఉన్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో గత ఏడాది విద్యార్థులచేత మ్యాన్‌హోల్‌ శుభ్రం చేయించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పట్లో తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ట్‌ (డ్రాయింగ్‌) టీచర్‌ మునియప్ప మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. మాస్తి పోలీసులు ఫోన్లలోని డేటాను పరిశీలించి, నగ్న వీడియోలను గుర్తించారు. సాంఘిక సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు మునియప్పపై పోక్సో కేసు నమోదు చేశారు. మునియప్ప తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు, ఉపాధ్యాయుడి చర్య నీచమని, భయంకరమని వ్యాఖ్యానించింది. కేసు రద్దుకు నిరాకరించింది. ఉపాధ్యాయుడి నుంచి 5 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా, ఐదు వేలకు పైగా నగ్నవీడియోలు ఉన్న విషయం బహిర్గతమైంది. అందులో విద్యార్థినులు బట్టలు మార్చుకునేవి, బాత్రూంలో ఉన్న సమయంలో చిత్రీకరించినవి ఉన్నట్టు సమాచారం.

Updated Date - Sep 10 , 2024 | 02:47 AM

Advertising
Advertising