ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tamil Nadu : 52కు కల్తీసారా మృతులు

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:04 AM

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  • తల్లిదండ్రులను కోల్పోయిన

  • పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే: స్టాలిన్‌

  • మరణాలకు బాధ్యులెవరో చెప్పండి

  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

  • కల్తీసారా మృతులు 52

చెన్నై, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. కాగా కళ్లకుర్చిలో కల్తీసారా విక్రయాల వ్యవహారానికి సంబంధించి పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. కల్తీసారా కారణంగా 52 మంది మృతి చెందిన ఘటన శుక్రవారం అసెంబ్లీలో ప్రకంపనలు రేపింది. ఈ ఘటనకు బాధ్యత వహించి స్టాలిన్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా నల్లచొక్కాలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. దీంతో సభ గందరగోళంగా తయారవడంతో స్పీకర్‌ అప్పావు అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులను సభ నుంచి మార్షల్స్‌ చేత గెంటేయించారు. కాగా, కల్తీసారా దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. ఈ మరణాలకు ఎవరు బాధ్యులని ప్రభుత్వాన్ని నిలదీసింది. కల్తీసారాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది.


పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే: స్టాలిన్‌

కళ్లకుర్చిలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి పిల్లల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు డిగ్రీ చదివే వరకు అయ్యే విద్యా సంబంధిత ఫీజులు, హాస్టల్‌ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి, సంరక్షకుడి పెంపకంలో ఉండే పిల్లలకు ప్రతి నెలా రూ.5వేల చొప్పున, వారికి 18 యేళ్ల వయస్సు వచ్చే వరకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాక పిల్లల పేరుమీద రూ.5లక్షలు డిపాజిట్‌ చేసి, వారికి 18 యేళ్ల వయస్సు వచ్చినప్పుడు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని అందిస్తుందని తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 04:04 AM

Advertising
Advertising