ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Punjab: రైతుల ఆందోళన: 54 రైళ్లు రద్దు

ABN, Publish Date - Apr 20 , 2024 | 07:52 PM

పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు.

పాటియాలా, ఏప్రిల్ 20: పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు. దీంతో అంబాలా - అమృత్‌సర్ మార్గంలో 54 రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో న్యూఢిల్లీ-అమృత్‌సర్, రిషికేష్-శ్రీగంగానగర్, లూథియానా-అంబాలా కంటోన్మెంట్ రైళ్లు రద్దు అయిన వాటిలో ఉన్నాయని పేర్కొంది.

తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఢిల్లీ ఛలో పాదయాత్రకు పిలుపునిచ్చారు. అందులోభాగంగా.. పిబ్రవరి 13వ తేదీన రైతులు చేస్తున్న పాదయాత్రను పంజాబ్, హర్యానాల మధ్య సరిహద్దు శంభు, ఖనౌరి వద్ద నిలిపివేశారు. నాటి నుంచి వారు అక్కడే ఉన్నారు.


వారిలో నవదీప్, గుర్కిరాత్, అనీష్ ఖతర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అనిష్ అరెస్ట్ అయిన నాటి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో అతడి ఆరోగ్యం రోజు రోజుకు క్షిణిస్తుంది. ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్యంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ ముగ్గురు రైతులు విడుదలయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ స్పష్టం చేశారు.

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందన్నారు. ఆ క్రమంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. అలాగే ఎవరికి ఓటు వేయ్యమని చెప్పనన్నారు. కానీ రైతులకు మంచి చేసే పార్టీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసునని... వారికి ఓటు వేయాలని రైతులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చ ఆధ్వర్యంలో జరుగుతుంది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 20 , 2024 | 07:52 PM

Advertising
Advertising