ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

ABN, Publish Date - Aug 15 , 2024 | 07:19 PM

దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.

వారణాసి, ఆగస్ట్ 15: వారణాసి నుంచి ముంబయి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానంలో ప్రయాణికుడు దశరథ్ గిరి (82) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఏటీసీ అధికారులకు విమాన పైలట్‌ సమాచారం ఇచ్చారు. దీంతో విమానాన్ని భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. దశరథ్ గిరి అప్పటికే మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

Also Read: RG Kar Medical College Student: కుమార్తె చనిపోయే ముందు డైరీలో ఏం రాసిందంటే..

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..


వారణాసికి చెందిన దశరథ్ గిరి.. వైద్య చికిత్స కోసం ముంబయి వెళ్తున్నారని సమాచారం. వారణాసి నుంచి ముంబయి బయలుదేరిన కొద్దిసేపటికి దశరథ్ గిరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని విమాన సిబ్బంది ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై భోపాల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రయాణికుడు తీవ్ర అనారోగ్యానికి గురి కాగానే.. ఎయిర్ పోర్ట్ అధికారులు, విమాన సిబ్బంది సకాలంలో స్పందించారని తెలిపారు.

Also Read: Jammu Kashmir Assembly Elections: డీజీపీగా నళిన్ ప్రభాత్

Also Read: Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?


దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు. ప్రయాణికుడు తీవ్ర అనారోగ్యానికి గురైతే.. విమానా సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే స్పందించారని గుర్తు చేశారు. కానీ ఆసుపత్రికి తరలిస్తుండగానే దశరథ్ గిరి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని చెప్పారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 15 , 2024 | 07:20 PM

Advertising
Advertising
<