ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా 90 శాతం దేశ జనాభా

ABN, Publish Date - Aug 24 , 2024 | 09:14 PM

కులగణనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి గళం విప్పారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే కులగణన తప్పనిసరి అన్నారు.

ప్రయాగరాజ్: కులగణనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి గళం విప్పారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే కులగణన (caste census) తప్పనిసరని అన్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం కొరవడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో శనివారం జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ప్రభుత్వ పాలనా వ్యవస్థకు దూరంగా ఉండిపోయిన 90 శాతం మంది ప్రజలకు తగిన నైపుణ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ వారికి పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యే అవకాశం రావడం లేదన్నారు. అందువల్లే తాము కులగణన చేపట్టాలని బలంగా చెబుతున్నామని తెలిపారు.

Amit shah: 2026 మార్చి నాటికి నక్సలిజం నుంచి దేశానికి విముక్తి


''మా వరకూ కులగణన అంటే అది కేవలం కులాల లెక్కలు కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాది. కులగణన చేసినంత మాత్రాన సరిపోదు. వివిధ కులాల మధ్య సంపద పంపిణీ ఎలా ఉందో అధ్యయనం చేయాలి. అదేవిధంగా బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంతుందో కూడా తెలుసుకోవాలి" అని రాహుల్ అన్నారు. తాను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, బీజేపీ తనకు రాజకీయ గురువుగా మారిందని, ఏమి చేయకూడదనేది ఆ పార్టీని చూసి నేర్చుకుంటున్నానని విసుర్లు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరుపుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని చెప్పారు. రాజకీయపరంగా నష్టం జరిగినా కులగణన జరిపించి తీరుతామని అన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 09:14 PM

Advertising
Advertising
<