ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Train: లోకోపైలట్ లేకుండా 70కిలోమీటర్లు పరుగులు తీసిన రైలు.. చివరకు..

ABN, Publish Date - Feb 25 , 2024 | 03:08 PM

లోకోపైలట్ లేకుండా 70 కిలోమీటర్లు ట్రాక్‌పై రైలు పరిగెత్తిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది. ఆదివారం ఉదయం గూడ్స్ రైలు లోకోపైలట్ లేకుండా రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది.

లోకోపైలట్ లేకుండా 70 కిలోమీటర్లు ట్రాక్‌పై రైలు పరిగెత్తిన ఘటన జమ్మూలోని కథువాలో జరిగింది. ఆదివారం ఉదయం గూడ్స్ రైలు లోకోపైలట్ లేకుండా రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది. హ్యాండ్‌బ్రేక్ వేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. రైలు కదలడం స్టార్ట్ అయినప్పుడు అక్కడ లోకోపైలట్ లేడు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ముందస్తు స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైలు 70 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత దసుహా వద్ద నిలిపివేశారు. ఈ రైలు తనంతట తానుగా నడుస్తోందని, లోకోపైలట్ లేడని తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు జమ్మూలోని కథువా స్టేషన్ నుంచి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వైపు వేగంగా పరుగెత్తడం ప్రారంభించింది. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. రైలు మార్గంపై అధికారులు నిరంతరం అప్‌డేట్‌లు ఇచ్చారు. చివరకు కథువా నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద వ్యయప్రయాసలకోర్చి రైలును ఆపారు.


హ్యాండ్‌బ్రేక్ వేయకపోవడం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఆ రైలు లోకోపైలెట్ చెప్పారు. రైలు కదులుతున్నప్పుడు తాను అక్కడ లేడని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ నుంచి ఓ బృందం జమ్మూ చేరుకుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 03:18 PM

Advertising
Advertising