ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai : కోన్‌ ఐస్‌క్రీమ్‌లో చేతివేలి ముక్క!

ABN, Publish Date - Jun 14 , 2024 | 03:41 AM

భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్‌ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్‌ ప్రాంతంలోని ఓర్లెమ్‌ బెండన్‌ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.

తింటుంటే నాలుక్కింద గోరుతో కూడిన అర అంగుళం పొడువు ముక్క

ఓ వైద్యుడికి జుగుప్సాకరమైన అనుభవం.. ముంబైలో ఘటన

ఐస్‌క్రీమ్‌ కంపెనీపై కేసు నమోదు

పరీక్షల కోసం ల్యాబ్‌కు అవశేషం

ముంబై, జూన్‌ 13: భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్‌ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్‌ ప్రాంతంలోని ఓర్లెమ్‌ బెండన్‌ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.

సెర్రావో బుధవారం ఓ ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లో ‘యమ్మో’ అనే కంపెనీ నుంచి బటర్‌ స్కాచ్‌ ప్లేవర్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ పెట్టారు. డెలివరీ బాయ్‌ తెచ్చిచ్చాక లంచ్‌ తర్వాత ఆ ఐస్‌క్రీమ్‌ను ఆయన తినడం మొదలు పెట్టారు. నాలుక కింద ఏదో గట్టిగా తగలడంతో దాన్ని బయటకు తీసి చూశారు. అర అంగుళం పొడవు, గోరుతో కూడిన ఓ ముక్క కనిపించింది. స్వయంగా వైద్యుడు కావడంతో అది మనిషి చేతి వేలు అని సెర్రావో నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి.. ఆ చేతివేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ ఐస్‌క్రీమ్‌ తయారు చేసిన ‘యమ్మో ఐస్‌క్రీమ్‌ కంపెనీ’పై కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 14 , 2024 | 03:41 AM

Advertising
Advertising