Bengaluru : సూరజ్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. శివకుమార్ యూటర్న్
ABN, Publish Date - Jun 27 , 2024 | 04:59 AM
అసహజ లైంగిక దౌర్జన్యం ఆరోపణతో అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.
బెంగళూరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అసహజ లైంగిక దౌర్జన్యం ఆరోపణతో అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. నాలుగు రోజుల కిందట సూరజ్ బ్రిగేడ్ కోశాధికారినంటూ సూరజ్‌కు మద్దతుగా నిలిచిన శివకుమార్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. సూరజ్ రేవణ్ణ స్వలింగకాముకుడని, మూడేళ్ల కిందట తనపైనా అసహజ లైంగిక దౌర్జన్యం చేశారని ఆరోపించారు. సూరజ్‌పై ఇటీవల ఇదే తరహా ఆరోపణలు జేడీఎస్ కార్యకర్తకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పారు.
అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా, సూరజ్‌పై ఫిర్యాదు చేసిన జేడీఎస్ కార్యకర్త.. మీడియాకు ఆయన గురించి మరిన్ని విషయాలు తెలిపారు. అమావాస్య రోజున సూరజ్‌రేవణ్ణ చేతులకు గాజులు ధరిస్తారని, చీర కడతారని వివరించారు. ఎన్నికల సందర్భంగా అరకలగూడులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సూరజ్.. తన ఫోన్ నంబరు తీసుకొని తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని పేర్కొన్నారు. ఫాంహౌ్‌సకు పిలిపించి లైంగిక దౌర్జన్యానికి పాల్పడేవారని ఆరోపించారు. ఈ విషయం ఎక్కడా చెప్పరాదని రూ. 2 కోట్లతో పాటు పని ఇప్పిస్తానని ఆశ చూపారని అన్నారు. ఒప్పుకోనందుకు ప్రాణం తీస్తానని బెదిరించారని, ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
Updated Date - Jun 27 , 2024 | 07:01 AM