ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: ప్రధాని మోదీ పుట్టినరోజు నేపథ్యంలో.. 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:12 AM

రేపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది ఇప్పటి నుంచే ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 13 ఏళ్ల బాలిక ప్రధాని మోదీ చిత్రాన్ని ప్రత్యేకంగా 800 కిలోల మిల్లెట్లతో రూపొందించి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Modi 74th birthday

రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సహా సామాన్యుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. నరేంద్ర మోదీ(Narendra Modi) సెప్టెంబర్ 17, 1950న జన్మించారు. ఈ నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 17న) నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అయితే మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి నుంచే అనేక మంది అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 13 ఏళ్ల పాఠశాలకు వెళ్లే బాలిక ప్రధాని మోదీకి వినూత్నంగా పుట్టినరోజుకు ఒక రోజు ముందు శుభాకాంక్షలు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


800 కిలోలతో

తమిళనాడు(tamilnadu)కు చెందిన 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ప్రెస్లీ షెకినా 800 కిలోల తృణ ధాన్యాలతో నిరంతరం 12 గంటల పాటు శ్రమించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్‌ను ప్రెస్లీ ఆవిష్కరించింది. 800 కిలోల మిల్లెట్లతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెకినా ప్రధాని మోదీ చిత్రపటాన్ని రూపొందించింది. 13 ఏళ్ల ఈ యువతి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించి రాత్రి 8.30 గంటలకు వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసింది.


అభినందనలు

ప్రెస్లీ షెకినా చెన్నైలోని కొలపాక్కం ప్రాంతంలో నివసిస్తున్న ప్రతాప్ సెల్వం, సంకిరాణి (తల్లి) కుమార్తె. ప్రెస్లీ షెకినా ఓ ప్రైవేట్ పాఠశాలలో (చెన్నై) 8వ తరగతి చదువుతుంది. ఈ విషయం తెలిసిన యూనికో వరల్డ్ రికార్డ్స్ తన రికార్డులలో ప్రెస్లీ రూపొందించిన చిత్రాన్ని నమోదు చేసింది. ఇది స్టూడెంట్ అచీవ్‌మెంట్ కేటగిరీ కింద నమోదు చేశారు. ఈ క్రమంలో UNICO వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆర్ శివరామన్ ప్రెస్లీ షెకినాకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్, పతకాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చిన్నారి సాధించిన విజయం గురించి తెలుసుకున్న పాఠశాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రులు, బంధువులు సహా పలువురు అభినందిస్తున్నారు.


అసలు మిల్లెట్స్ అంటే ఏంటి

సాధారణ భాషలో మిల్లెట్లను ముతక ధాన్యాలు అని కూడా పిలుస్తారు. వీటిలో జొన్న, ప్రోసో, పెర్ల్, ఫాక్స్‌టైల్, ఫింగర్, బ్రౌన్‌టాప్, బార్న్యార్డ్, లిటిల్ మిల్లెట్ (మొరైయో), బుక్వీట్ (కుట్టు), అమరాంత్, కోడో సహా పలు రకాల మిల్లెట్లు ఉన్నాయి. వీటిని రోటీ, దోసె, ఇడ్లీ, నూడుల్స్, బిస్కెట్లు సహా పలు రకాల ఆహారాలలో ఉపయోగించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 18 మందికి గాయాలు


Local Media : ‘శంకర్‌ దాదా.. ఎంబీబీఎస్’లు!

Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 16 , 2024 | 11:25 AM

Advertising
Advertising