Accident: బస్సును ఢీకొట్టిన ట్యాంకర్.. ఐదుగురు మృతి, మరో 20 మందికి గాయాలు
ABN, Publish Date - Aug 22 , 2024 | 11:17 AM
ఆయిల్ ట్యాంకర్ ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది(accident). దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్‌పై నుంచి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయిల్ ట్యాంకర్ ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది(accident). దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్‌పై నుంచి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన ఒడిశా(Odisha)లోని గంజాం జిల్లా(Ganjam district)లో జరిగింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ అంబులెన్స్‌లో బెర్హంపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం ఎలా జరిగింది?
సమాచారం ప్రకారం ఈ ప్రమాదం గజం జిల్లా హింజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబర్‌జోల్ కంజూరు చౌక్‌లో జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో చోటుచేసుకుంది. ఆ క్రమంలోనే ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ బస్సును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం దాదాపు పూర్తిగా ఛిద్రమైపోయింది. వేగంగా ఢీకొనడంతో రెండు వాహనాలు కూడా రోడ్డు పక్కనే ఉన్న టీ స్టాల్ పరిధిలో ఎగిరి పడ్డాయి. దీంతో టీ దుకాణం వద్ద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
మద్యం మత్తులో..
అందిన సమాచారం ప్రకారం భవానీపట్నానికి చెందిన ఖంబేశ్వరి అనే ప్యాసింజర్ బస్సు 40 మందికి పైగా ప్రయాణికులతో బెర్హంపూర్ వైపు వెళ్తోంది. ఆ క్రమంలోనే బెర్హంపూర్ నుంచి అసికా వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఓవర్ టెక్ చేస్తున్న క్రమంలో ఢీకొట్టింది. క్షతగాత్రులకు బెర్హంపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే చాలా మంది ప్రమాదం నుంచి బయటపడగా, మరికొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా సాధారణంగా డ్రైవింగ్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బస్సు డ్రైవర్ స్పాట్‌లోనే మరణించారు.
ఇవి కూడా చదవండి:
Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు
PM Modi: శాంతి సందేశంతో యుద్ధభూమికి!
High Court: భర్త వీర్యాన్ని భద్రపరచుకోవచ్చు: హైకోర్టు
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 22 , 2024 | 11:30 AM