Teacher: అశ్లీల వీడియోలు చూపించి ఆరుగురు విద్యార్థులను వేధించిన ఉపాధ్యాయుడు అరెస్ట్
ABN, Publish Date - Aug 21 , 2024 | 09:06 AM
మహారాష్ట్ర బద్లాపూర్ తర్వాత, ఇప్పుడు అకోలాలో కూడా బాలికలపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలను అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు నిందితుడు టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రోజురోజుకు మహిళలు, చిన్నారులపై జరిగే వేధింపుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటివల కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హాత్యాచార ఘటన మరువక ముందే.. ఇటివల మహారాష్ట్ర(maharashtra) బద్లాపూర్‌లోని ఓ స్కూల్లో ఇద్దరు విద్యార్థినులను వేధించిన ఘటన బయటకు వచ్చింది. తాజాగా ఇదే రాష్ట్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా(akola) జిల్లాలో బాలికలకు అశ్లీల వీడియోలు చూపించి వారిని అనుచితంగా తాకినట్లు 47 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
నాలుగు నెలలుగా
ప్రమోద్ సర్దార్ అనే ఉపాధ్యాయుడిపై(teacher) విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు అకోలాలోని కాజిఖేడ్ ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ విద్యార్థి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి టీచర్‌పై ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం గత నాలుగు నెలలుగా టీచర్ తమకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆరుగురు విద్యార్థినులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
NHRC: బద్లాపూర్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం.. మహారాష్ట్ర సీఎస్, డీజీపీకి నోటీస్
తల్లిదండ్రులు
ఈ కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడు ప్రమోద్ సర్దార్‌పై పోలీసులు(police) BNS సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. పాఠశాలలో చదువుతున్న బాలికలను ఈ టీచర్ గత 4 నెలలుగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 8వ తరగతి చదువుతున్న కొందరు బాలికలకు అసభ్యకర వీడియోలు చూపిస్తున్నారని, తమను అనుచితంగా తాకుతున్నారని ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్యార్థినులతో కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని బాధిత బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రమోద్ సర్దార్ చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు ఉరల్ పోలీసులను ఆశ్రయించి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు.
ఇది మరువక ముందే..
ఈ క్రమంలో ఆరుగురు బాలికల వాంగ్మూలాలు కూడా నమోదు చేయబడ్డాయి. ఈ క్రమంలో నిందితుడిపై బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ 74, 75 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుందని ఉరల్ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అకోలా జిల్లాలోని ఉరల్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం ఇంకా చల్లారకముందే కాజీఖేడ్‌లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
Bharat Bandh: నేడు భారత్ బంద్.. సూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..
CV Ananda Bose : బెంగాల్లో అనిశ్చితి
ఎంపాక్స్ చికిత్సకు మార్గదర్శకాలు
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 22 , 2024 | 12:20 PM