ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా తల్లీ.. ఏకంగా బస్సులోనే..!!

ABN, Publish Date - Feb 25 , 2024 | 03:40 PM

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ధూమపానం మాత్రమే కాదండోయ్.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే ఏ చిన్న విషయమైనా నేరం కిందికే వస్తుంది.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ధూమపానం మాత్రమే కాదండోయ్.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే ఏ చిన్న విషయమైనా నేరం కిందికే వస్తుంది. కొన్నిసార్లు పోకిరీలు బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగించడం సర్వసాధారణం. వింత వింత పనులు చేస్తూ తోటి ప్రయాణికులకు భయాందోళనకు గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

సాధారణ ప్రయాణికురాలిగా ఓ బస్సు ఎక్కిన యువతి అందరూ ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్న సమయంలో వింత చర్యకు పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న టపాసులను బస్సులోనే కాల్చింది. ఆమె సహచరులు కొందరు ఆమెను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఊహించని ఘటనతో అవాక్కైన ప్రయాణికులు కొందరు తలపై చేయి వేసుకున్నారు. భారీ శబ్దం రావడం, నిప్పు రవ్వలు ఎగిసిపడుతుండటంతో బస్సులో ఉన్నవారందరూ భయంతో వణికిపోయారు. గతేడాది జరిగిన ఈ ఘటన ప్రస్తుతం మళ్లీ వైరల్ గా మారింది.


సమాచారం అందుకున్న అధికారులు బస్సును ఆపి.. యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా రవాణాలో ఉద్దేశపూర్వకంగా టపాసులు పేల్చడం బాధ్యతారాహిత్య ప్రవర్తన అని వారు చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు యువతి ప్రవర్తనకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెను జైలుకు పంపాలి అని కోపంతో ఊగిపోతున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 04:13 PM

Advertising
Advertising