ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Husband Murder: భర్తనే మట్టుబెట్టి.. పైకి అమాయకంగా..

ABN, Publish Date - Jun 18 , 2024 | 06:35 PM

ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. రెండోసారి ట్రై చేసింది. ఈ సారి భర్త చనిపోయాడు. ప్రియుడితో కలిసి ఎంచక్కా కులుమనాలి వెళ్లింది. అంత సవ్యంగా సాగుతోన్న వేళ ఆ వివాహిత బావ రంగంలోకి దిగారు. అతని రిక్వెస్ట్ మేరకు కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Husband Murder

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యింది. రెండోసారి ట్రై చేసింది. ఈ సారి భర్త చనిపోయాడు. ప్రియుడితో కలిసి ఎంచక్కా కులుమనాలి వెళ్లింది. అంత సవ్యంగా సాగుతోన్న వేళ ఆ వివాహిత బావ రంగంలోకి దిగారు. అతని రిక్వెస్ట్ మేరకు కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీని తలపించే ట్విస్ట్‌లు ఈ కేసులో ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?


ఏం జరిగిందంటే..?

హర్యానా పానిపట్‌కు చెందిన వినోద్- నిధి దంపతులు. వ్యాపార పనుల్లో వినోద్ బిజీగా ఉండేవారు. నిధి స్థానికంగా ఉండే జిమ్‌కు వెళ్లేది. అక్కడ జిమ్ ట్రైనర్ సుమిత్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. ఈ విషయం వినోద్‌కు తెలిసింది. భార్య నిధితోపాటు సుమిత్‌ను చాలాసార్లు మందలించాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. వినోద్ ఒత్తిడి చేయడంతో నిధి- సుమిత్ తట్టుకోలేక పోయారు. ఎలాగైనా సరే అతడిని హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు.


సుఫారీ

పంజాబ్‌కు చెందిన దేవ్ సునార్‌ను సుమిత్- నిధి కలిశారు. వినోద్‌ను హత్య చేయాలని అడిగారు. హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని హామీనిచ్చారు. వినోద్ కారును ట్రక్కుతో దేవ్ సునార్ 2021 జనవరి 5వ తేదీన ఢీ కొట్టాడు. ఆ ప్రమాదంలో వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. వినోద్ ప్రాణాలతో బయటపడటంతో నిధి- సుమిత్ తట్టుకోలేక పోయారు. దాంతో ప్లాన్ బీ అమలు చేశారు.


కాల్చి.. కేసు విషయం చెప్పడంతో

వినోద్‌ను ఎలాగైనా సరే చంపాలని నిధి- సుమిత్ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి దేవ్ సునార్‌ను ఆశ్రయించారు. అప్పటికే హిట్ అండ్ రన్ కేసు కొనసాగుతోంది. ఆ కేసు విచారణ జరిగే క్రమంలో.. ఓ రోజు వినోద్ ఇంటికి దేవ్ వచ్చాడు. కేసు వెనక్కి తీసుకోవాలని కోరాడు. అందుకు వినోద్ నిరాకరించడంతో తుపాకీతో కాల్చాడు. అక్కడికక్కడి వినోద్ చనిపోయాడు. వినోద్ చనిపోయిన తర్వాత దేవ్ కేసు వెనక్కి తీసుకోవాలని చెబితే వినలేదని అందుకే చంపానని పోలీసులకు వివరించారు.


మొదట అర్థం కాలే..

దేవ్ మాటలు విన్న పోలీసులకు అసలు ఏం అర్థం కాలేదు. హిట్ అండ్ రన్ కేసు కోసం వ్యక్తిని హత్యచేయాలా..? అని అనుమానించారు. దానికితోడు వినోద్ సోదరుడు సందేహాం వ్యక్తం చేయడంతో వెంటనే కేసు రీ ఇన్వెస్టిగేషన్ చేశారు. విచారణ క్రమంలో నిధి-సుమిత్ రిలేషన్ షిప్ బయట పడింది. వారిద్దరిని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం ఒప్పుకున్నారు. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను నిధి కడతేర్చింది. ప్రియుడితో కలిసి అరెస్టై ఊచలు లెక్కబెడుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 06:36 PM

Advertising
Advertising