National : ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం
ABN, Publish Date - May 31 , 2024 | 03:50 AM
చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
బెంగళూరు, మే 30(ఆంధ్రజ్యోతి): చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కేరళ రాష్ట్రం కాసరగోడు పట్టణానికి చెందిన ఓ యువతి జిమ్‌కు వెళ్తుండేవారు. ఆమెతో జిమ్ ట్రైనర్ సుజిత్ స్నేహంగా ఉండేవాడు.
యువతికి పైల్స్ సమస్య ఉండటంతో మంగళూరులోని ఏజే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ స్పెషల్ వార్డులో ఓ గదిలో ఉన్న యువతిపై సుజిత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్న వీడియోలను తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు.
చెప్పినట్లు వినకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. మంగళూరులోని మహారాజ హోటల్‌కు రప్పించుకుని మరోసారి అత్యాచారం చేశాడు. ఆమెకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఫాదర్ ముల్లర్స్ ఆస్పత్రిలో చేరింది.
అక్కడా ఆత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ కద్రి ప్రాంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ ట్రైనర్‌ను అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - May 31 , 2024 | 07:55 AM