Delhi Assembly Elections: ఆప్ నాలుగో జాబితా... కేజ్రీవాల్ పోటీ అక్కడి నుంచే?
ABN, Publish Date - Dec 15 , 2024 | 02:47 PM
ఇంతకుముందు మూడు జాబితాల్లో 32 మంది అభ్యర్థులను 'ఆప్' ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విడుదల చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇతర ప్రముఖ నేతల్లో కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహల్వాన్, ఉత్తమ్‌నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు. ఇంతకుముందు మూడు జాబితాల్లో 32 మంది అభ్యర్థులను 'ఆప్' ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది.
రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు!
''ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. పూర్తి ధీమా, పూర్తి సన్నాహకాలతో ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తోంది'' అని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ''వాళ్లకు సీఎం అభ్యర్థు లేరు, టీమ్ లేదు, ప్లానింగ్ లేదు, ఢిల్లీపై ఎలాంటి విజన్ లేదు. వాళ్లకు కేజ్రీవాల్‌ను తొలిగించాలనే ఒకే నినాదం, ఒకే విధానం, ఒకే మిషన్ ఉంది'' అని వ్యాఖ్యానించారు.
గత జాబితాలో..
ఆప్ మూడో జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థిని ప్రకటించింది. నజఫ్‌గఢ్ అసెంబ్లీ సీటు నుంచి తరుణ్ యాదవ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు వారాల క్రితం ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్ స్థానంలో తరుణ్ యాదవ్‌ను నిలబెట్టింది. 20 మందితో కూడిన రెండో జాబితాలో మనీష్ సిసోడియా, దినేష్ భరద్వాజ్, సురేందర్ పాల్ సింగ్ బిట్టూ, ముఖేష్ గోయల్ రాకేష్ జాతవ్ ధర్మరక్షక్, అవథ్ ఓఝా, ప్రతాప్ మిట్టల్ తదితరులకు చోటు లభించింది. 2025 ఫిబ్రవరిలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర
For National News And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 03:08 PM