Anti-Terror Agency NIA: బెంగళూరు కేఫ్‌లో ‘అందుకే’ బాంబు పేలుడుకు ప్లాన్
ABN, Publish Date - Sep 09 , 2024 | 07:42 PM
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం చార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను ఎన్ఐఏ తన ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది.
బెంగళూరు, సెప్టెంబర్ 09: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం చార్జీ షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను ఎన్ఐఏ తన ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలోని రామాలయంలో బాలా రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ నేపథ్యంలో అదే రోజు.. బెంగళూరులో మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయం పేల్చివేతకు ఈ నిందితులు కుట్ర పన్నారని పేర్కొంది.
Also Read: Haryana Assembly Elections: కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. తొలి జాబితా విడుదల: ఆప్
Also Read: RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర
కానీ ఆ ప్రయత్నం విఫలమైందని తెలిపింది. దీంతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చాలని వీరు నిర్ణయించారని వివరించింది. అలాగే ఈ పేలుడుకు పాల్పడిన నిందితులు కర్ణాటకలోని శివమొగ జిల్లాకు చెందిన ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలకు ఏ రూపంలో నగదు అందింది... అదే విధంగా వీరు పాల్పడిన హింసాత్మక ఘటనలను సైతం ఈ సందర్భంగా తన ఛార్జీ షీట్‌లో ఎన్ఐఏ పొందుపరిచింది. యువతలో సిరియాకు చెందిన ఐసిస్ ఉగ్రవాద భావజాలం నింపేందుకు వీరు వ్యవహరించారని స్పష్టం చేసింది.
Also Read: Delhi: ఉన్నతాధికారి ఇంట్లో సీబీఐ సోదాలు: రూ. 2.39 కోట్లు సీజ్
Also Read: Uttar Pradesh: 9 రోజుల తర్వాత.. ఎట్టకేలకు దొరికిన మృతదేహం.. ఎవరిదంటే..?
ఈ ఏడాది మార్చి 1వ తేదీన బెంగళూరులోని బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిది మంది గాయపడిన విషయం విధితమే. ఈ పేలుడు సంభవించిన దాదాపు 42 రోజుల అనంతరం ఈ పేలుడుకు పాల్పడిన నిందితులను పశ్చిమ బెంగాల్‌లోని ఓ రహస్య స్థావరంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఛార్జీషీట్‌లో పేర్కొన్న నిందితులు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్‌తోపాటు ముజమ్మిల్ షరీఫ్ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.
Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు
Read More National News and Latest Telugu News Click Here
Updated Date - Sep 09 , 2024 | 07:43 PM