Rahul Navin: ఈడీ కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
ABN, Publish Date - Aug 14 , 2024 | 08:54 PM
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ బుధవారం నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని తెలిపింది.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ (Rahul Navin) బుధవారం నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని తెలిపింది.
United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం
ఏభై ఏడేళ్ల రాహుల్ నవీన్ 2019 నవంబర్‌లో ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1993 ఐఆర్ఎస్ ఆఫీసర్ బ్యాచ్‌కు చెందిన ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ యాక్టింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇన్‌టర్మ్ ఈడీగా ఆయన హయాంలోనే వేర్వేరు మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని తరచు పొడిగించడం సరికాదంటూ సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేయడంతో రాహుల్ నవీన్‌ను ఈడీ యాక్టింగ్ చీఫ్‌గా కేంద్రం నియమించింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 14 , 2024 | 09:23 PM