Actor Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీఖాన్ పోటీచేసే నియోజకవర్గం ఏదో ఖరారైందిగా..
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:18 PM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తమ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినప్పటికీ తాను వేలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సినీ నటుడు, ఇండియా జననాయక పులిగల్ కట్చి వ్యవస్థాపకుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) ప్రకటించారు.
చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తమ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోయినప్పటికీ తాను వేలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సినీ నటుడు, ఇండియా జననాయక పులిగల్ కట్చి వ్యవస్థాపకుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) ప్రకటించారు. ఆయన గురువారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, తన దగ్గర అనేక మంది రుణం తీసుకున్నారు, కానీ, తాను ఇప్పటివరకు తాను ఒక్కరి వద్ద కూడా అప్పు తీసుకోలేదన్నారు. తన వద్ద రుణం తీసుకున్న వారిలో చాలా మంది ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదన్నారు. అలాంటి చరిత్ర ఉన్న తనను కొందరు రాజకీయ నేతలు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. ‘ఇలాంటి వ్యక్తిని అన్నాడీఎంకేలో చేర్చుకుని ఎంపీ సీటు కేటాయించడమా? అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అన్నాడీఎంకే అనే పెద్ద పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరిపిందన్నారు. ఈ చర్చల్లో తమ పార్టీకి వేలూరు ఎంపీ సీటును ఇవ్వాలని కోరగా, ఇప్పటివరకు వారు ఎలాంటి సమాధానం చెప్పలేదని, అయినప్పటికీ తమ పార్టీకి అన్నాడీఎంకే సీటు కేటాయించినా, కేటాయించకపోయినా తాను మాత్రం వేలూరు లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
Updated Date - Mar 15 , 2024 | 12:18 PM