ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Actor Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN, Publish Date - Apr 10 , 2024 | 12:37 PM

ఒకే భాష - ఒకే పార్టీ - ఒక్కరే మహాప్రభు అంటున్న ఆ ప్రభు రెండు నాలుకల పాములాంటివారని, అబద్ధాల మహాపురాణం చెప్పడంలో తిరుగులేని వారని, అలాంటి అహంకారిని గద్దె దించాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌(Actor Prakash Raj) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- అహంకారిని గద్దె దించాలి: ప్రకాశ్‌రాజ్‌

బెంగళూరు: ఒకే భాష - ఒకే పార్టీ - ఒక్కరే మహాప్రభు అంటున్న ఆ ప్రభు రెండు నాలుకల పాములాంటివారని, అబద్ధాల మహాపురాణం చెప్పడంలో తిరుగులేని వారని, అలాంటి అహంకారిని గద్దె దించాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌(Actor Prakash Raj) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దేశాన్ని రక్షించండి’ సంకల్పయాత్ర ముగింపులో భాగంగా బుధవారం బెళగావిలో ఆయన మాట్లాడారు. పరోక్షంగా ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండానే మహాప్రభువు నగ్నత్వాన్ని బట్టబయలు చేస్తానని అన్నారు. మానవత్వం కల్గినవారు సర్వాధికారిని కిందకు దింపే బాధ్యత తీసుకోవాలన్నారు. మహాప్రభువు శాశ్వతం కాదన్నారు. సర్వాధికారి తొలి లక్షణాలు బాగా ఉంటాయని, మహాప్రభువు అహంకారం చివరిదశకు చేరిందన్నారు. అవినీతిపరులు ఆ పార్టీలో చేరి ఉత్తమలవుతున్నారని, సిగ్గులేని అహంకార పార్టీ బీజేపీయేనన్నారు. మన ప్రాంతానికి మన నాయకుడు కావాలని, ఆయన ముఖం చూసి ఓటు వేస్తే కంగనా రనౌత్‌కు ఓటు వేసినట్టే అవుతుందన్నారు. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి తీవ్రంగా స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత అవసరం లేదన్నారు. హుబ్బళ్ళిలో మంగళవారం మాట్లాడుతూ ఆయనో అసంతృప్తి జీవి అన్నారు. రాజకీయాల్లో ఆయన స్థానం ఏమిటో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రకాశ్‌రాజ్‌, కమల్‌హాసన్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని, వారుసైతం విమర్శలు చేస్తారన్నారు. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యల్లో వాస్తవాలు ఉంటే 18 రాష్ట్రాల్లో బీజేపీ పాలన సాధ్యమా అని ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: BJP candidate: ఆ రోలెక్స్‌ వాచ్‌ బిల్లు ఎక్కడుందో చెబుతారా..?

Updated Date - Apr 10 , 2024 | 12:37 PM

Advertising
Advertising