ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Actor SV Shekhar: ఆయన వచ్చాక బీజేపీలో నేరస్తులకే చోటు..

ABN, Publish Date - Oct 06 , 2024 | 12:13 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వచ్చాక నేరస్తులకే ఆ పార్టీలో చోటు లభిస్తోందని, అందుకే తాను ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ సీనియర్‌ సినీ నటుడు ఎస్వీ శేఖర్‌(Actor SV Shekhar) ప్రకటించారు.

- అందుకే ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరం

- సీనియర్‌ నటుడు ఎస్వీ శేఖర్‌

చెన్నై: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వచ్చాక నేరస్తులకే ఆ పార్టీలో చోటు లభిస్తోందని, అందుకే తాను ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ సీనియర్‌ సినీ నటుడు ఎస్వీ శేఖర్‌(Actor SV Shekhar) ప్రకటించారు. ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవల తన పేరుతో కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు బాంబు బెదిరింపులు వెళ్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులపై చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: అనవసర ఆరోపణలకు నేనెందుకు రాజీనామా చేయాలి?


సనాతన వ్యవహారంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉయదనిధి స్టాలిన్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా విమర్శించిన విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సనాతన ధర్మంలో అందరి అభిప్రాయం ఒకటిగా ఉండదని, హిందూ సనాతనంపై పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) ఎక్కువ ప్రేమ చూపుతున్నారని, అది ఆయన అభీష్టమన్నారు. సనాతనాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరని, నాశనం చేస్తామని ప్రగల్భాలు పలికేవారు అడ్రస్‌ లేకుండా పోతారన్నారు.


కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను దేవుడికి నైవేద్యంగా పెట్టడం తప్పు అని, అదే విధంగా ప్రసాదాలను తినాల్సిందేనని బలవంతం చేయడం కూడా సరి కాదన్నారు. తాను ఇకపై బీజేపీ దరి చేరబోనని, ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) కోరితే అప్పుడు ఆలోచిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు నెలలుగా అన్నామలై ఇక్కడ లేనందున, అలాంటివారెవ్వరూ చేరలేదన్నారు. అన్నామలై మళ్లీ చెన్నై వచ్చాక పాత విధానమే కొనసాగుతుందని విమర్శించారు.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. మళ్లీ ఓటీఎస్

ఇదికూడా చదవండి: KTR: మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?

ఇదికూడా చదవండి: Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2024 | 12:13 PM