PM Modi: అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి
ABN, Publish Date - Oct 29 , 2024 | 02:54 PM
రోజ్‌గార్ మేళా కింద ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువకులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని. ఈరోజు చాలా శుభదినమని, ఎంప్లాయిమెంట్ మేళాలో 51,000 యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు.
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దీపావళికి మరో ప్రత్యేకత కూడా ఉందని, అయోధ్య ఆలయంలో రాముడు దీపావళి జరుపుకోనున్నాడని చెప్పారు. ఇలా జరగడం గత 500 ఏళ్లలో ఇదే మొదటిసారని అన్నారు.
Indian Railways: దీపావళి పండగ వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్
"దీపావళి పర్వదినం సందర్భంగా దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరో రెండు రోజుల్లో దీపావళికి జరుపుకోనున్నాం. ఈ ఏడాది దీపావళికి ప్రత్యేకత ఉంది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలోని భవ్యమందిరంలో రాముడు కొలువయ్యాడు. ఆయనతో కలిసి దీపావళి జరుపుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇలాంటి ప్రత్యేకత కలిగిన గ్రాండ్ దీపావళిని చూసే అదృష్టం మనందరికీ కలుగుతోంది'' అని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి ఇదే కావడం విశేషం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రామాలయ ప్రారంభోత్సవంలో వాణిజ్యవేత్తలు, బాలీవుడ్ నటులు, క్రికెటర్లు సహా వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు.
రోజ్‌గార్ మేళా కింద ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువకులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. ''దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు చాలా శుభదినం. ఎంప్లాయిమెంట్ మేళాలో 51,000 యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. వారిందరికీ అభినందనలు తెలియజేస్తున్నానుు. లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతుంది'' అని చెప్పారు. హర్యానాలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం 26,000 ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రత్యేకతను చాటుకుందని మోదీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 29 , 2024 | 02:55 PM