ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: మహారాష్ట్రలో రేపే సీఎం, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం..!

ABN, Publish Date - Nov 24 , 2024 | 03:18 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకర కార్యక్రమం సోమవారం జరిగే అవకాశముందని శిండే కేబినెట్‌లోని సీనియర్ మంత్రి దీపక్ ఆదివారం ముంబయిలో వెల్లడించారు.

ముంబయి, నవంబర్ 24: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సారథ్యంలోని మహాయుతి కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి వర్గాలు సన్నాహాలు చేస్తు్న్నాయి. అందులోభాగంగా సోమవారం సీఎంతోపాటు మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. సీఎం శిండే కేబినెట్‌లోని సీనియర్ మంత్రి దీపక్ కేశర్‌కర్ ఆదివారం ముంబయిలో వెల్లడించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలుగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే దానిపై ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదని తెలిపారు. అలాగే మంత్రి వర్గంలో చోటు దక్కే వారు ఎవరనే విషయంలో సైతం స్పష్టత లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పారు. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో .. మిత్రపక్షాలను సంప్రదిస్తారని దీపక్ వివరించారు.


మరోవైపు ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఎలాంటి వివాదాలు ఉండవని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఎన్నికల అనంతరం మూడు పార్టీల నేతలు కలిసి కూర్చొని సీఎం సీటుపై నిర్ణయం తీసుకోవాలని తొలి రోజు నుంచే నిర్ణయించుకున్నామని ఫడ్నవీస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీకి ఒక విడతలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో.. మహాయుతి కూటమి 235 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కూటమిలోని భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీనే 132 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో మహారాష్ట్రంలో ఆ పార్టీ గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా సాగుతుంది. గతంలో ఆయన మహారాష్ట్ర సీఎంగా పని చేశారు. అలాగే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు.


ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (శిండే) పార్టీలకు చెందిన మహాయుతి కూటమికి.. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) పార్టీలకు చెందిన మహా వికాస్ అఘాడీ మధ్య గట్టి పోరు జరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (శిండే) కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఈ కూటమికి ఏక పక్షంగా విజయం దక్కింది. దాంతో సోమవారం మహాయుతి కూటమిలోని నేతలు ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రచారం సాగుతుంది. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీలోని భాగస్వామ్య పక్షాలు పట్టుమని 50 సీట్లను సైతం గెలుచుకో లేక పోయింది.

For National News And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 03:18 PM