Patanjali: క్షమాపణలు చెబుతూ మళ్లీ పతంజలి ప్రకటనలు
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:02 AM
సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు క్షమాపణలు చెబుతూ పంతజలి సంస్థ మళ్లీ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు క్షమాపణలు చెబుతూ పంతజలి సంస్థ మళ్లీ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు ఇవ్వవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెప్పింది. పతంజలి సంస్థల వ్యవస్థాపకులు యోగా గురు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలు వ్యక్తిగత హోదాలో కూడా క్షమాపణలు చెబుతూ బుధవారం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.
పతంజలి ఉత్పత్తులపై ప్రకటనలు ఇవ్వవద్దంటూ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇచ్చిన ప్రకటనలు మరీ చిన్నగా ఉండడంతో అభ్యంతరం చెప్పింది. మళ్లీ ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించడంతో దాన్ని అమలు చేసింది.
Updated Date - Apr 26 , 2024 | 06:47 AM