Train Accident: అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 కోచ్‌లు
ABN, Publish Date - Oct 17 , 2024 | 07:44 PM
అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ గురువారం పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 నుంచి 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం అసోంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
మరో ప్రయాణికుల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో 8 నుంచి 10 కోచ్‌లు పట్టాలు తప్పగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కోచ్‌లు పట్టాలు తప్పిన రైలు అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు అని చెబుతున్నారు. ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం 3.55 గంటలకు జరిగింది. అగర్తల, ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య నడుస్తున్న రైలు డిబాలాంగ్ స్టేషన్ గుండా వెళుతుండగా పట్టాలు తప్పింది. అయితే పట్టాలు తప్పిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.
సీఎం రియాక్షన్
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత అసోం సీఎం హిమంత విశ్వ శర్మ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రైలు నెం. 12520 అగర్తల-LTT ఎక్స్‌ప్రెస్ 8 కోచ్‌లు ఈరోజు 15:55 గంటలకు లుమ్‌డింగ్ సమీపంలోని డిబ్లాంగ్ స్టేషన్‌లో పట్టాలు తప్పాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు పెద్దగా నష్టం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో తాను రైల్వే అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు.
హెల్ప్ లైన్
ప్రమాదానికి ముందు అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం బయలుదేరింది. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. దీంతో లుమ్డింగ్ బదర్‌పూర్ సింగిల్ లైన్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో ప్రజలు సహాయం, అదనపు సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 03674 263120, 03674 263126లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. అయితే అసలు రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
గతంలో
ఇటివల అక్టోబర్ 11న తమిళనాడులోని కవరపేటై వద్ద గూడ్స్ రైలును ఢీకొనడంతో ఎక్స్‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పిన వారం రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి ముందు 2023 బాలాసోర్ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రజలు మరణించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి ప్రవేశించి, గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ దూసుకెళ్లగా 296 మంది మృతి చెందారు. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 17 , 2024 | 08:01 PM