CAA: సీఏఏపై స్టే విధించండి.. సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్
ABN, Publish Date - Mar 16 , 2024 | 04:02 PM
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై స్టే విధించాలని కోరుతూ AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసి.. నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది.
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై స్టే విధించాలని కోరుతూ AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసి.. నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం సీఏఏ ముఖ్య ఉద్దేశం.
CAAని NPR (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్), NRC (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)తో కలిపి చూడాలని ఓవైసీ కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చే విషయానికి తాను వ్యతిరేకం కాదని అన్నారు. హైదరాబాద్ ప్రజలు సీఏఏకు వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని అసద్ విమర్శించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 16 , 2024 | 04:08 PM